వారి మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలను చంపేసుకుంటూ పోతే అడిగేవారు లేరనుకున్నారా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే చూస్తు ఊరుకోము. వారి మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ఎస్సీ మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపారు. ముఖ్యమంత్రి మాత్రం మాస్కు పెట్టుకోరు అని మండిపడ్డారు. రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు.













