Chandra Babu: ఆంధ్రను టెక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు గ్రాండ్ ప్లాన్

ఇప్పుడు అందరి దృష్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) మీదే ఉంది. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో, ఇప్పుడు అదే స్థానం ఏఐ (AI) తీసుకుంటోంది. ఈ మార్పును తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం (AP CM) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చాలా త్వరగా గ్రహించారు. ఏఐ సాంకేతికతను రాష్ట్ర అభివృద్ధికి వినియోగించే దిశగా ఆయన ముందడుగు వేశారు. నూతనంగా రూపుదిద్దుకుంటున్న రాజధాని అమరావతిని (Amaravathi ) ఏఐ కేపిటల్‌గా (AI Capital) తీర్చిదిద్దే లక్ష్యంతో చంద్రబాబు చర్యలు చేపట్టారు. అలాగే, డేటా ఎనలైటిక్స్ (Data Analytics) వంటి ఆధునిక రంగాల్లో విశాఖను (Vishaka) ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని పట్టుదలగా ఉన్నారు.
సోమవారం రోజున అమరావతిలోని వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (Vellore Institute of Technology) కొత్త భవనాలను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అమరావతితో పాటు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని తమ యోచన అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, గూగుల్ (Google) వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీ త్వరలో విశాఖలో అడుగుపెట్టబోతోందని ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని చెప్పారు. గూగుల్ వచ్చేసరికి, విశాఖ డేటా ఎనలైటిక్స్‌లో ప్రపంచానికి కేంద్రబిందువుగా మారుతుందని చెప్పారు. ఏఐ ఆధారిత డేటా ఎనలైటిక్స్ విశాఖ నుంచి అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అప్పట్లో ఐటీ ను ఎలా రాష్ట్ర అభివృద్ధికి మార్గంగా మలిచారు ఇప్పుడు అదే తరహాలో తన పాలనలోనే ఏఐ రంగానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల అమెరికా పర్యటనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) , గూగుల్, మైక్రోసాఫ్ట్ (Microsoft) , టెస్లా (Tesla) , అబోడ్ వంటి దిగ్గజ సంస్థల అధికారులతో సమావేశమయ్యారు. ఏపీలో, ముఖ్యంగా విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని వివరించి, రాష్ట్రం మీద వారి ఆసక్తిని పెంచారు.
ఆ తర్వాత ఈ సంస్థల ప్రతినిధులు ఏపీని సందర్శించి, అమరావతి మరియు విశాఖపట్నం ప్రాంతాలను పరిశీలించారు. విశాఖ డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమని వారు అభిప్రాయపడ్డారు. తాజా సమాచారం ప్రకారం, గూగుల్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు చెబుతున్నారు. దీనితో చంద్రబాబు తాజాగా చేసిన ప్రకటన మరింత నమ్మకాన్ని ఇచ్చింది. గూగుల్ అడుగుపెడితే, మరోవైపు ఇతర టెక్ కంపెనీలు కూడా విశాఖ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. చంద్రబాబు ప్లానింగ్ పక్కగా సాగితే ఆంధ్ర టెక్నాలజీ దిగ్గజంగా రూపాంతరం చెందుతుంది.