తెలుగువారిని రక్షించండి : చంద్రబాబు
వుహాన్‌లో చిక్కుకుపోయిన 58 మంది తెలుగు ఉద్యోగులను సురక్షితంగా భారత్‌కు రప్పించాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్, టీసీఎల్ ఉద్యోగులు వుహాన్‌లో చిక్కుకున్నారు. కరోనా వైరస్‌కు కేంద్రంగా ఉన్న వుహాన్ నుంచి వారు బయటకి రావడం కష్టంగా మారింది. ఇటీవల మీరు పాకిస్థాన్ నుంచి 20 మంది తెలుగువారిని దేశానికి తీసుకొచ్చేందుకు చేసిన కృషిని తెలుగువారు మరచిపోలేరు. ఈ 58 మందిని సైతం సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోండి అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.













