ధర్మ పోరాట దీక్షపై ప్రజలకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
కేంద్ర నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, వంచనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేస్తున్నాను -హోదా, విభజన హామీల సాధనకు పోరాటాన్ని ఉధ తం చేయాల్సిన సమయం ఇది – కేంద్రం తన ఆఖరి బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి అన్యాయమే చేసింది – విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలి – రైల్వే జోన్ ఇవ్వడం కుదరదంటున్నారు – ఉక్కు కర్మాగారం లాభసాటి కాదంటున్నారు – ఓడరేవుకు అభ్యంతరాలు పెడతూ తాత్సారం చేస్తున్నారు – యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చినా ఇవ్వలేదన్నట్లు ప్రకటనలు చేస్తున్నారు – కుట్ర పూరితంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు – వెనకబడిన జిల్లాల అభివ ద్ధికి ఇస్తున్న సాయం నామమాత్రంగా ఉంది – మనవి చట్టబద్ధమైన, న్యాయమైన కోరికలని కేంద్రం గుర్తించి వ్యవహరించాలన్న డిమాండ్‌తో చేస్తున్న దీక్షకు ప్రజలు మద్దతు పలకాలని చంద్రబాబు కోరారు.













