వారికి భద్రత కల్పించండి : చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్నికి చంద్రబాబు లేఖ రాశారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసే కేంద్రం వద్దే దాడి జరిగిందని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దాడిలో 30 మంది వరకు పాల్గొని వెంకటేశ్‌పై దాడి చేశారని, ఈ దాడిలో వెంకటేశ్ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడిరచారు. దాడి చేయడమే కాకుండా నామపత్రాలు చించేసి సెల్ ఫోన్ లాక్కున్నారని మండిపడ్డారు. ఈ దాడికి సంబంధించిన ఫొటోలను ఎస్ఈసీకి రాసిన లేఖతో జత చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని టీడీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.













