నారా లోకేశ్ కు చంద్రబాబు శుభాకాంక్షలు
యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గం కనుగొనేందుకు పాదయాత్ర అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఇది దోహదపడి ఉంటుంది. ఇంకా చాలా మైళ్లు ప్రయాణించాల్సి ఉంది అని ట్వీట్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో పాటు పాదయాత్ర సమయంలో యువత, విద్యార్థులతో లోకేశ్ దిగిన ఓ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.













