వంగవీటి రాధాకు టీడీపీ అండగా ఉంటుంది
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రంగవీటి రాధాపై రెక్కీ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాశారు. ఇటీవల రాధాను ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు ఇప్పుడు నేరుగా విజయవాడలోని వంగవీటి రాధా నివాసానికి వెళ్లిన చంద్రబాబు రెక్కీ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన ఇంటికి వచ్చిన చంద్రబాబుకు రాధా సాదర స్వాగతం పలికారు. భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాధాకు టీడీపీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని పేర్కొన్నారు. రాధా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.













