Chandrababu: చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన మంత్రులు
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) పర్యటించారు. అంబేడ్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం చర్చించారు. అనంతరం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అంతకు ముందు ముప్పాళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు హోంమంత్రి అనిత(Anitha), మంత్రులు కొల్లు రవీంద్ర(Kollu Ravindra) , సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని శివనాథ్ ఘన స్వాగతం పలికారు.













