ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలి : టీడీపీ
కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని కేంద్రానికి తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలు, పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరారు. విశాఖ మెడ్‌టెక్ జోన్ ఎంతో ఉపయోగపడుతోందని ఈ సందర్భంగా నేతలు అన్నారు. కరోనాతో మరణించిన వ్యక్తి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని టీడీపీ కోరింది. పేదలు, రైతులు, క్షౌరశాలల కరెంటు, నీటి బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే, వారంతా స్వస్థలాలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బందికీ పీపీఈలు అందించాలని సూచించింది.













