తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో సంతోషం ఉండాలి…
కర్నూలు, మంత్రాలయం అసెంబ్లీల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
బూత్ కమిటి, ఏరియా కమిటి కన్వీనర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో సంతోషం ఉండాలి, అన్నివర్గాల్లో టిడిపిపై సంతృప్తి నెలకొనాలి.
అభివృద్ది,సంక్షేమంలో పార్టీకి, ప్రజలకు మీరే వారధులు. మిమ్మల్ని అందరినీ నమ్మి ఒక బాధ్యత అప్పగించాం. నిరంతరం ప్రజలను అంటిపెట్టుకుని ఉండాలి. వాళ్ల సమస్యలు మీ ద్వారా పరిష్కారం కావాలి. ప్రజల్లో మీకు శాశ్వత గౌరవం కల్పించే బాధ్యత నాది. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మీది. ఎక్కువ ఓట్లు రాబట్టినవాళ్లకే పదవులు, పార్టీలో సాధికారత. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో టిడిపి జెండా రెపరెపలాడాలి. దానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలను మీరంతా పెంచుకోవాలి.













