37 ఏళ్ల చరిత్రలో… 22 ఏళ్లు మనమే
37 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో 22 ఏళ్లు మనమే అధికారంలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ మ్యుమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అధికారానికి దూరంగా ఉన్న పదేళ్లు రాష్ట్రంలో జరిగిన అరాచకం అందరికి తెలిసిందేనన్నారు. ప్రకటించిన అభ్యర్థులందరినీ కార్యకర్తలు ఆశీర్వదించాలని సూచించారు. జరిగేవి ప్రజా ఎన్నికలని, వారి మనోభావాలకు తగ్గట్టే అభ్యర్థులను ఖరారు చేశామన్నారు.
భావితరాలకు ఉపయోగపడే ప్రజా ఉద్యమంగా ఈ ఎన్నికలు జరగాలన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమలు అమలు చేస్తుండడంతో పాటు, ఎవరూ చేయలేని అభివృద్ధి చేశామని ధీమా వ్యక్తం చేశారు. ఓటు మార్పు చేసి మళ్లీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని తెలిపారు. టికెట్ రాని వారెవ్వరూ నిరాశ చెందొద్దని, అందరి సేవలూ గుర్తించి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యం అందరికి కల్పించే బాధ్యత తనదని సృష్టం చేశారు.













