‘టిడిపి-జయహో బిసి’ సభతో వైసిపి బెంబేలెత్తింది: సీఎం చంద్రబాబు
ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పాల్గొన్న టిడిపి నేతలు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులు. ప్యానిక్ రియాక్షన్ తో జగన్మోహన్ రెడ్డికి ఫ్రస్టేషన్ గా మారింది. నిరాశా నిస్పృహలతోనే వైసిపి ఏలూరు బీసి సభ పెట్టారు. తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నెముక. జనాభాలో 50% ఉన్న బిసిల మద్దతు టిడిపికే. దానిని జీర్ణించుకోలేకే వైసిపి విమర్శలు. జగన్ మొసలి కన్నీరు బీసిలు నమ్మరు. జగన్ తండ్రి బీసిలను అణిచివేశారు. బీసి ఫెడరేషన్లకు కుర్చీలు, బెంచీలకు కూడా నిధులివ్వలేదు. బీసి సబ్ ప్లాన్ కు టిడిపి ప్రభుత్వమే చట్టబద్దత ఇచ్చింది. మళ్లీ చట్టబద్దత చేస్తాననడం జగన్ అవివేకం. చేసిన చట్టాన్నే మళ్లీ చట్టంగా చేస్తానంటాడు.
బడ్జెట్ గురించి, నిధుల విడుదల గురించి జగన్ కు తెలియదు. ప్రాధమిక ఆర్ధిక నిబంధనల పరిజ్ఞానం జగన్ కు లేదు. అవినీతి సంపద పెంచుకోవడమే జగన్ కు తెలుసు.
సమాజ సంపద పెంచడం జగన్ కు చేతకాదు.













