అందుకే కాపులకు 5 శాతం రిజర్వేషన్స్
కులాల్లో చిచ్చుపెట్టాలని వైసీపీ, బీజేపీ నేతలు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. అగ్రకులాల్లో కాపులు సగంపైనా ఉన్నారని, కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల శాతమే అధికమని, అందుకే ఈడబ్ల్యుఎస్ 10 శాతం రిజర్వేషన్లల్లో కాపులకు 5 శాతం ఇచ్చామని ఆయన సృష్టం చేశారు. కాపు రిజర్వేషన్లను బీజేపీ, వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ వెళ్లి కాపుల రిజర్వేషన్ల గురించి అడగలేని అసమర్ధులు వాళ్లని, కాపులకు మేలు చేసిన టీడీపీని నిందిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై బీజేపీ, వైసీపీకి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని నాటి ముఖ్యమంత్రి వైఎస్ మోసం చేశారన్నారు.













