అందుకే ఎన్నికల కమిషన్ పై పోరాటం : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో ఈనెల 22న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు 25 మంది లోక్‌సభ అభ్యర్థులను సమావేశానికి రావాలని ఆదేశించారు. పోటీ చేసిన అభ్యర్థులందరితో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 23 నుంచి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాని వెళ్లనున్నట్లు చంద్రబాబు తెలిపారు. పీలేరులో ఎన్నికల కమిషన్ ఇష్టారాజ్యాంగా వ్యవహరించిందన్న టీడీపీ అభ్యర్థి కిశోర్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రతిపక్షం ఏం చెబితే ఈసీ ఆ పనిచేసిందని ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు అందుకే ఎన్నికల కమిషన్‌పై పోరాడుతున్నానన్నారు. ఫామ్-17 గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.













