ఆ రోజు అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు
ఓటమికి కారణాలు వెతుకుతున్న వైసీపీ నేతలు ఈసీ, పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కావాలని నిర్ణయించారు. జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని నేతలకు ఆదేశించారు. ఈ రెండు కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు. కౌంటింగ్ రోజు బందోబస్తుపై ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించారు. 175 నియోజకవర్గాలకు 120 మంది పరిశీలకులను నియమించడం పట్ల టీడీపీ అభ్యంతరంవ్యక్తం చేసింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు సృష్టం చేశారు. వాటిపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.













