ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు… లేవు
తెలుగుదేశం పార్టీలో గ్రూపులకు చెక్ పెట్టాల్సిందేనని ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలనతో వైసీపీ పని అయిపోయిందని, జరిగేది వన్‌సైడ్ ఎలక్షన్ అని అన్నారు. ఇంత ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదన్నారు. టీడీపీలో గ్రూపులకు చెక్ పెట్టాల్సిందేనని అన్నారు. వైసీపీ పాలనపై ప్రజలకున్న అసంతృప్తే మహానాడు విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు. ఒంగోలు నేతల సమిష్టి కృషితో మహానాడును విజయవంతం చేశారని ఇదే విధానాన్ని అన్ని జిల్లాల నేతలు పాటించాలని సూచించారు. ఓట్ల తొలగింపుపై గ్రామస్థాయి నేతలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యకర్తల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ ట్రస్టు తీసుకొచ్చిన యాప్ సేవలను ఈ సందర్భంగా వివరించారు.













