హరిత నగరంగా అమరావతి : చంద్రబాబు
అమరావతిని అత్యుత్తమ హరిత నగరంగా, ప్రపంచంలో ఉత్తమ పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిని ఉత్తమ గ్రీన్ అండ్ బ్లూ సిటీగా మార్చేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) రూపొందించిన సమగ్ర కార్యచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి నగర అభివృద్ధిని గుర్తించి ప్రపంచబ్యాంకు ఏజీడీపీకి రూ.1484 కోట్లు రుణమిచ్చేందుకు సూతప్రాయంగా అంగీకరించిందన్నారు. ఏజీడీపీ కార్యచరణను సమర్థంగా, నిర్దేశిత గడవులోగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. ఏజీడీపీతో నగరంలో వేడిని తగ్గించడం, వరదలను నివారించడం, భూగర్భ జలమట్టాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.













