జీవన ప్రమాణాలు పెంచేందుకే జన్మభూమి: చంద్రబాబు
జన్మభూమి 4వరోజుపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు. జీవన ప్రమాణాలు పెంచేందుకే జన్మభూమి: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈ జన్మభూమిలో ఫిర్యాదుల సంఖ్య సగం తగ్గింది. ప్రజల భాగస్వామ్యం రెట్టింపు అయ్యింది. వైద్య శిబిరాలకు, వెటర్నరీ క్యాంపులకు స్పందన బాగుంది. ఇది చాలా సానుకూల పరిణామం. నాలుగున్నరేళ్ల మన శ్రమ ఫలితం. ప్రతిగ్రామంలో, వార్డులో అభివృద్ధి పనులు చేశాం. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
ఒకవైపు అభివృద్ధి పనులు కళ్ల ముందే ఉన్నాయి. మరోవైపు అర్హులు అందరికీ సంక్షేమం ఇస్తున్నాం. ప్రజల్లో సంతృప్తే ఫిర్యాదుల సంఖ్య తగ్గడానికి కారణం
రేషన్,పెన్షన్,ఇళ్ల కోసం వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. అర్జీదారుల్లో అర్హులు అందరికీ న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రగతికి రథాలు ప్రజలు, ఉద్యోగులే. ఇరువర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేకం చేశాం.
ఉద్యోగుల నేస్తం మన రాష్ట్రప్రభుత్వం. సొంత ఇల్లులేని ప్రతి ఉద్యోగికి గృహ వసతి కల్పిస్తాం. ఉద్యోగుల సొంతఇల్లు కల నెరవేరుస్తాం. ప్రభుత్వ సేవల ద్వారా ప్రజా సేవచేసే ప్రతి ఉద్యోగికి సొంతఇల్లు ఉండాలి. ముప్ఫై,నలభై ఏళ్లు హైదరాబాద్ తో అనుబంధం వదులుకుని ఉద్యోగులు,లాయర్లు ఇక్కడికి వచ్చారు. వారు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి భూములు గుర్తించాలి. అపార్ట్ మెంట్లు నిర్మించి ప్లాట్లు కేటాయించాలి. రైతుల పండుగ సంక్రాంతి. పంట దిగుబడులు ఇంటికొచ్చే పర్వదినం.
సంక్రాంతి దినాల్లో జన్మభూమి పండుగలా జరపాలి. తీవ్ర ఆర్ధికలోటులో కూడా రైతులకు రూ.24వేల కోట్ల రుణమాఫీ చేశాం. ప్రతి రైతుకు రూ.లక్షా 50వేల ప్రయోజనం.
రూ.4వేల కోట్ల ఇన్ పుట్ సబ్సిడి ఇచ్చాం. రూ.4వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులు కొన్నాం. కౌలురైతులకు రూ.9100కోట్ల పంటరుణాలు ఇవ్వడం దేశంలోనే రికార్డు.
క్రాప్ హాలిడేస్,పవర్ హాలిడేస్ లేకుండా చేశాం. గతంలో ఎరువులు అడిగితే లాఠీచార్జిలు, పోలీస్ స్టేషన్లలో విత్తనాల పంపిణీ జరిగేది. ఆ పరిస్థితులే లేకుండా చేశాం. రైతులను అన్నివిధాలా ఆదుకున్నాం. ఈ రోజు గ్రామసభలో రైతు సంక్షేమంపై చర్చ జరపాలి. పెట్టుబడి లేని వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాలి.
చుక్కల భూమి సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. 64ఏళ్లుగా రైతులను సతమతం చేస్తున్న సమస్య. భూమిని బదిలీ చేసుకోలేక, అమ్ముకోలేక అనేక మంది రైతులు ఇబ్బందులు. ప్రభుత్వమే సుమోటాగా చుక్కల భూముల సమస్యలను పరిష్కరించాలి. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలి.













