నదుల అనుసందానంతో సత్ఫలితాలు: సీఎం చంద్రబాబు
సమర్ధ నీటి నిర్వహణతో అధిక దిగుబడులు. నీరు-ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు. సమర్ధ నీటి నిర్వహణతో అధిక దిగుబడులు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు చేరాయి. పలమనేరులో పండుగ వాతావరణం. రైతులు జలసిరికి హారతి పడుతున్నారు. జలవనరుల శాఖకు అభినందనలు. ఇంజనీర్లు, సిబ్బంది సమష్టి కృషితోనే సాధ్యం అయ్యింది. పోలవరం ప్రాజెక్టు 66% పూర్తి చేశాం.19ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యింది. మరో 4ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 62ప్రాజెక్టుల పనులు శరవేగంగా చేస్తున్నాం. జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలి. వర్షాకాలంలోపు పనులు వేగంగా పూర్తిచేయాలి.
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించాలి. రాబోయే 3 నెలలు తాగునీటిపై దృష్టి పెట్టాలి. వర్షాభావంలోనూ సాగునీటి కొరత లేకుండా చేశాం. ఇక తాగునీటి కొరత నివారణపై మనందరం దృష్టి. గ్రామాలు, వార్డులలో తాగునీటి రవాణాపై ప్రత్యేక శ్రద్ద చూపాలి. వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే మన ధ్యేయం. వ్యవసాయం అనుబంధ రంగాల్లో 11% వృద్ధి సాధించాం. రబీలో ఉత్పాదకత పెరిగేలా చూడాలి. విస్తీర్ణం తగ్గినా ఉత్పాదకత పెంచితే లోటు భర్తీ. మార్కెటింగ్ సమస్యలు లేకుండా చూడాలి.
‘అన్నదాత సుఖీభవ’ మార్గదర్శకాలు సిద్ధం. కేంద్రం ఇవ్వని రైతులకు కూడా రాష్ట్రం ఇస్తోంది. కౌలురైతులకు, 5ఎకరాలు పైబడిన వారికి ఇస్తున్నాం. కౌలురైతులకు రూ.9,654 కోట్ల పంటరుణాలు దేశంలో రికార్డు. 27లక్షల మంది కౌలురైతులకు ప్రయోజనం. నరేగాతో పశుగ్రాసం సాగును ప్రోత్సహించాలి. సైలేజ్,టిఎంఆర్,కాన్సెంట్రేట్స్ పంపిణీ చేయాలి. ఇప్పటిదాకా 1.3లక్షల టన్నుల సైలేజ్ పంపిణి. కరవు మండలాల్లో సైలేజ్,టిఎంఆర్ పంపిణి చేయాలి. గోకులాలు,మినీ గోకులాలపై రైతుల్లో ఆసక్తి.
పసుపు-కుంకుమ నిధులు విడుదల చేశాం. రూ.2,175కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేశాం. సిబ్బందిలేరని,నగదు లేదని ఇబ్బందులు పెట్టరాదు. జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ బ్యాంకర్లతో సమీక్షించాలి. డ్వాక్రా మహిళలకు ఇబ్బందులు ఉండకూడదు. నీతి అయోగ్ ర్యాంకుల్లో మనమే ముందున్నాం. సర్వీస్ డెలివరీలో నెంబర్ 1 ర్యాంకు సాధించాం.
మిగిలిన పారామీటర్లలో 2వ ర్యాంకు సాధించాం. మహిళా శిశు సంక్షేమంలో ముందున్నాం. మౌలిక సదుపాయాలు అభివృద్ది చేశాం. ఒక ఎకో సిస్టమ్ కల్పించాం. స్ఫూర్తిదాయక సమయంలో ఉన్నాం. ఇదే స్ఫూర్తిని ఇకపై కూడా కొనసాగించాలి.
భూగర్భజలాల పెంపుపై ఏపికి జాతీయ పురస్కారం. ఏపి ‘నీరు-చెట్టు,నీరు-ప్రగతి’కి అవార్డులు. గ్లోబల్ ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ ఫౌండేషన్ ‘ప్లాటినం’ అవార్డు. రాష్ట్ర ప్రగతికి అధికార యంత్రాంగం అద్భుత తోడ్పాటు. ఈ అవార్డులే అయిదేళ్ల మన కృషికి కొలమానాలు.













