ఎన్నికల్లో అవకాశం రాని వారికి మరో ఆఫర్ : చంద్రబాబు
2019-24కు సమర్థ బృందాన్ని ఎంపిక చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయమే ప్రామాణికమని సృష్టం చేశారు. ప్రత్యక ఎన్నికల్లో అవకాశం రాని వారికి… నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ తప్పుడు సర్వేలు చేస్తోందని విమర్శించారు. ఇతరులు సర్వే చేస్తే వైసీపీ అడ్డుకుంటోందన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ సర్వేలంటే వైసీపీకి భయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. బెదిరింపుల వల్లే కొందరు టీడీపీకి దూరమవుతున్నారని చెప్పుకొచ్చారు. బ్లాక్ మెయిలింగ్ చేసి టీడీపీ దూరం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆస్తులను చూపించి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.













