బీసీలపై వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు
బీసీల ఐక్యత దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందని, బీసీలపై వైసీసీ, టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. సోమవారం ఆయన ఎలక్షన్ మిషన్-2019పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగీా మాట్లాడుతూ టీఆర్ఎస్ 29 కులాలను బీసి జాబితా నుంచి తొలగించిందన్నారు. టీఆర్ఎస్తో జగన్ కలయిక బీసీ వ్యతిరేకమని చంద్రబాబు విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలే వైసీపీ అజెండా అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.
ఇటీవల రాజమండ్రిలో విజయవంతంగా నిర్వహించిన జయహో బీసి సభ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. బీసీ హామీలన్నింటినీ ఫ్లెక్సీలతో ప్రచారం చేయాలన్నారు. రాజమండ్రి సభ ‘మూడ్ ఆఫ్ ది స్టేట్’కు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. 50 శాతం బలంతో టీడీపీ ఓటింగ్ ప్రారంభం అవుతుందని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కానుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.













