రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలి : చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించారు. బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను చంద్రబాబు ప్రారంభించి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల ఉత్సాహం చూస్తుంటే వైసీపీని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని ఉత్సాహాన్ని చూస్తున్నా. 35 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేస్తాం. లక్ష మెజారిటీ ఇచ్చి కుప్పం స్థాయిని మరోసారి చాటిచెప్పండి. రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలి. వైసీపీ నేతలు హద్దుమీరి అరాచకాలు చేశారు. సైకోతో పోరాడాల్సి రావడం బాధాకరం. రాష్ట్ర ప్రజల కోసం సైకోతో పోరాడతా అని చంద్రబాబు స్పష్టం చేశారు.













