Chandrababu :ప్రపంచం మెచ్చిన ఏకైక నాయకుడు ప్రధాని మోదీ : సీఎం చంద్రబాబు
ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ (Prime Minister Modi ) శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల (AU Engineering College) మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి 93 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించింది. భవిష్యత్తులోనూ ఈ కాంబినేషన్ కొనసాగుతుంది. దేశ రాజకీయాల్లో మోదీ ప్రధానిగా ఉంటారు. ఢల్లీి ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలుస్తుంది. రాసి పెట్టుకోండి. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మోదీ కృషి చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన, మోదీ నినాదాలు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు మేకిన్ ఇండియా తెచ్చారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, గతిశక్తి తెచ్చారు. దేశానికి ఆర్థిక రాజధానిగా ముంబయి ఎలా ఉందో, ఏపీకి విశాఖ అలాంటి ఆర్థిక నగరం అని తెలిపారు.













