ప్రజలకు తప్ప నేనెవరికి భయపడను : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగి అవినీతి పెరిగిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ పాలన అవసరమని అన్నారు. రాష్ట్రంలో అన్నింటిపైనా ఛార్జీల మోత మోగిస్తున్నారు. అఖరికి చెత్త పైనా పన్ను వేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలే అని అన్నారు. ఈడీ దాడులు చేస్తారనే భయంతోనే జగన్ వైన్ షాప్‌ల్లో ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, దండాలు పెరిగిపోయాయి. నాసీరకం పత్తిత విత్తనాలతో రైతులు నిండా మునిగారు. ఒకే రాజధాని కావాలని ఆదోని ప్రజలు చెబుతున్న విషయంలో తాడేపల్లిలో ఉన్న జగన్ పేటీఎమ్ బ్యాచ్ చూడాలి. జగన్‌కు దమ్ముంటే ఆదోని వచ్చి 3 రాజధానులు గురించి అడగాలన్నారు.
రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే అన్న క్యాంటీన్లు తీసేశారు. తమిళనాడులో అమ్మా క్యాంటిన్ కంటిన్యూ చేస్తానని అక్కడి సీఎం స్టాలిన్ తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి మండల కేంద్రాల్లో అన్న క్యాంటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధిలో ఏపీ చివరి స్థానంలో ఉంది. డబ్బులు సంపాదించే మార్గం నాకు తెలుసు. ఆస్తులు తాకట్టు పెట్టే మార్గం జగన్‌కు తెలసు అన్నారు. నాపై కేసులు పెట్టేందుకు రాజశేఖర్ రెడ్డి కూడా సాహసించలేదు. ఆదోని ఎమ్మెల్యే కేసులు పెట్టి ఏం చేస్తారు. నన్నే భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజలకు తప్ప నేనెవరికి భయపడను అన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులు లేవు. ఏపీ అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరస్థితిని తీసుకొచ్చారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మేం సిద్ధం. నిండు మనసుతో ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి. మీ రుణం తీసుకుంటాను అని చంద్రబాబు అన్నారు.













