తెలుగు భాషను భావితరాలకు అందిస్తాం : చంద్రబాబు
తెలుగు భాషను వారసత్వ సంపదగా భావితరాలకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉండవల్లి ప్రజావేదికలో తెలుగు తల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేసి, వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణకు ఏడు అకాడమీలు, మాతృభాష అభివృద్ధికి తెలుగు ప్రాధికార సంస్థ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రాచీన భాషా కేంద్రాన్ని ఏఎన్‌యూలో ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. తెలుగు సాహిత్య సంపదను సుసంపన్నం చేయడానికి రచయితలు, కవులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.













