టీడీపీని ఎవరు ఏమి చేయలేరు : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరమని అన్నారు. వచ్చే నెలనుంచి కొత్త పెన్షన్లను అమలు చేస్తామని, అర్హులందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నవ నిర్మాణ దీక్షల సమయంలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఉపాధి హామీని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం లేదని అన్నారు. కేంద్రం సహకరించకున్నా రైతులను ఆదుకునేందుకు సిద్ధపడుతున్నామని ఆయన చెప్పారు. కర్ణాటక ఎన్నికల తరువాత తెలుగుదేశం సంగతి చూస్తామంటూ బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని సృష్టం చేశారు. న్యాయం కోసం ముఖ్యమంత్రిగా ప్రధానిపై పోరాడుతున్నానని ఆయన అన్నారు. వైకాపా లాలూచీ రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. మిగిలిన పార్టీల వైఖరిని కూడా గమనిస్తున్నారని తెలిపారు.













