నాలుగున్నరేళ్లలో గణనీయమైన అభివృద్ధి: ముఖ్యమంత్రి చంద్రబాబు
పెద్దఎత్తున పేదల సంక్షేమం చేశాం. ఇంత అభివృద్ధి, సంక్షేమం ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. టిడిపి సమన్వయ కమిటి సమావేశం ప్రారంభం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కమిటి సమావేశం.
పెద్దఎత్తున పేదల సంక్షేమం చేశాం. ఇంత అభివృద్ధి, సంక్షేమం ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. సీమ జిల్లాలకు సాగునీరు ఇచ్చాం.
కేంద్రం తోడ్పాటు లేకున్నా స్వయంకృషితో రాష్ట్రాభివృద్ది. ఒకేరోజు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు రావడం మన ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం. జన్మభూమి ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. 5,65,000 వినతులు వచ్చాయి. అన్నివర్గాల ప్రజల్లో విశేషమైన స్పందన ఉంది. ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల పూర్తి సానుకూలత ఉంది.
ఎన్నికలకు ముందు ఇంకా ఏం చేయాలి..? రాబోయే 5ఏళ్లకు అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గ్రామాభివృద్ధి ప్రణాళికలు, జిల్లా అభివృద్ధి ప్రణాళికలు తయారీ.
రైతుల్లో ఏవిధంగా సాధికారత తేవాలి..? పెట్టుబడులు తగ్గించడంపై దృష్టి పెట్టాం.
మహిళా గ్రూపులు నా మానస పుత్రికలు. బీమా మిత్ర, కళ్యాణ మిత్ర, గృహ మిత్రగా బాగా పనిచేస్తున్నారు. రూ.10వేలు పసుపు-కుంకుమ ఇచ్చాం. మహిళా గ్రూపులకు మరో రూ.10వేలు త్వరలో ఇస్తున్నాం. పోలవరంపై ఈ రోజు గడ్కరీకి లేఖ రాశాను. పోలవరానికి పెండింగ్ నిధులు విడుదల చేయాలి. డిపిఆర్-2 ఆమోదించాలని కోరాం. నెల రోజుల్లో చేస్తామన్న మాట నిలబెట్టుకోలేదు.
దేశం మొత్తం తిరిగినట్లు కెసిఆర్ హడావుడి. కోల్ కత్తా 22పార్టీలు హాజరైతే కెసిఆర్ రాలేదు. కెసిఆర్ ఆడేవన్నీ నాటకాలే. కెటిఆర్,జగన్ కొత్తనాటకానికి తెరదీశారు.
వాస్తవాలు ఎప్పుడూ దాచిపెట్టలేరు. వైసిపి గడియారాలపై కాగితం తొలగిస్తే టిఆర్ ఎస్ బొమ్మలు బైటపడ్డాయి. వైసిపి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోంది. పెన్షన్ రూ.2వేలకు పెంపు నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని చూసింది. షర్మిలతో ఫిర్యాదులు చేయించడం, కెటిఆర్ తో జగన్ భేటి కావడం వైసిపి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే.
బిజెపి రాయలసీమ డిక్లరేషన్ పేరుతో రెచ్చగొట్టాలని చూసింది. యూసిలు ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు. ఢిల్లీలో హోదా సమితి సభ్యులపై లాఠీచార్జ్ చేశారు. కనీసం వైసిపి నేతలు ఖండించలేదు.
కోల్ కత్తా భేటి దేశ ప్రజల మనోభావాలకు ప్రతిబింబం. బిజెపి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు అద్దం. మోది పాలనపై అన్నివర్గాల ప్రజల్లో వ్యతిరేకత. మోది పాలన దేశాన్ని అప్పుల్లో ముంచింది. 50% అప్పులు చేసిన ఘనత మోది దే. దేశం అప్పులను రూ.49 లక్షల కోట్ల నుంచి రూ.82లక్షల కోట్లకు పెంచారు. ఈబిసి 10% రిజర్వేషన్లు పెట్టినా ప్రజల్లో స్పందన లేదు.













