ప్రజల్లో ఈవీఎంలపై నమ్మకం రావడం లేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
పోల్ అయిన ఓట్లకంటే కౌంటింగ్ లో ఎక్కువ ఓట్లు ఎలా వస్తాయి..?
నా ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవడం మన ప్రాధమిక హక్కు. ఎవరికి ఓటు పడిందో అనే అనుమానాలు ఓటర్లలో రాకూడదు. అనుమానాలు వస్తే ప్రజాస్వామ్యం పరిహాసం అయినట్లే. ఇటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో రాకూడదు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి. ఈవీఎంల ద్వారా ప్రజాతీర్పు తారుమారయ్యే దుస్థితి రాకూడదు. ఈవిఎంలతో కుమ్మక్కు అయితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలి.
ఈవిఎం లోపాలపై తొలుత గళం విప్పింది తెలుగుదేశం పార్టీయే. వివి ప్యాట్ లు పెట్టాలని డిమాండ్ చేసింది టిడిపినే. తరువాత సుబ్రమణ్య స్వామి కోర్టుకెళ్లారు. వివి ప్యాట్ లలో గుర్తు సరిగ్గా పడటం లేదు. కొన్ని చోట్ల గుర్తు కనిపించడం లేదు.మరికొన్ని చోట్ల గుర్తు కరిగిపోతోంది. ప్రజాస్వామ్యంలో నమ్మకమే పునాది. విశ్వసనీయతే ప్రజాస్వామ్యానికి ప్రామాణికం.ఓటర్లలో నమ్మకం కలిగించాల్సింది ప్రభుత్వమే. ప్రజల్లో విశ్వసనీయత పెంచాల్సింది ప్రభుత్వమే. ఈవిఎం లోపాలపై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలి.













