మనం జరుపుకునే ఏకైక దీక్ష … నవనిర్మాణ దీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా మనం జరుపుకునే ఏకైక దీక్ష నవనిర్మాణ దీక్ష అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమలాపురంలో జరుగుతున్న నవనిర్మాణ దీక్ష సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్ని రాష్ట్రాల మాదిరిగా ఏపీలో పండుగ చేసుకునే పరిస్థితులోనే లేమని అన్నారు. అందుకే ఆ రోజున నవనిర్మాణ దీక్ష చేసి, అందరం అంకితమైన భావంతో పనిచేయాలని ముందుకు పోయామని అన్నారు. చాలా మంది దీక్షలు చేస్తారని అన్నారు. భవానీ, అయ్యప్ప, వెంకటేశ్వర, శివ దీక్షలు చేస్తారని, ముస్లింలు రంజాన్ దీక్షలు చేస్తారని అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల కోసం చేసే దీక్ష నవనిర్మాణ దీక్ష అని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు.
రాష్ట్రానికి న్యాయం చేస్తారనే ఆశించిన ఎన్డీయేలో భాగస్వాములయ్యామని, ఎన్నిలకంటే ముందే పొత్తు పెట్టుకున్నామని పేర్కొన్నారు. అయితే కేంద్రం నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. అందుకే నాలుగేళ్ల కిందట పెట్టుకున్న నవనిర్మాణ దీక్ష అప్పటి.. ఇప్పటికి ఉపయోగపడిందని అన్నారు. అందరం కష్టపడి రాష్ట్రాన్ని భారత దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేద్దామని పిలుపు ఇచ్చారు. అప్పుడు చెప్పిన మాటే ఇప్పుడూ చెబుతున్నానని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించాలి. ఇది వాళ్ల బాధ్యత అని అన్నారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా ముందుకు వెళతామే తప్ప వెనక్కిపోయే సమస్యే లేదని సృష్టం చేశారు.













