కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా : చంద్రబాబు
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, పవన్ కల్యాణ్‌లు కుట్ర పన్నుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన మోసం మరువలేనిదన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై ప్రధాన మంత్రి మోడీ కక్ష్య గట్టారని, అందుకే ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు. కేంద్రంతో ప్రాంతీయ పార్టీల హవా చూపుతాయన్నారు. దీంతో టీడీపీ కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు.
రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఉన్న ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఆ సంక్షేమ పథకాల అమలే వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీనీని అధికారంలో తెస్తాయన్నారు. కుట్ర రాజకీయాలను చిత్తు, చిత్తుగా ఓడించాలన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాల సాధనకు ప్రజలు ఆశీస్సులు కావాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజనను హేతుబద్దంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే, ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే ప్రధాని నరేంద్రమోదీ తీరని మోసం చేశారన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 2 నుంచి 8 వరకు నవ నిర్మాణ దీక్షలు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.













