ముస్లిం సంక్షేమానికి పెద్దపీట : చంద్రబాబు
రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని అన్నారు. మతవల్లీలు, ఇమామ్‌లు ప్రభుత్వం గౌరవవేతనం అందిస్తుందని తెలిపారు. ముస్లింమైనార్టిల పిల్లలకు ఉపకారవేతనాలు అందించిన వారిని ఉన్నతస్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు అమరనాథ్‌రెడ్డి, నారా లోకేష్, అచ్చన్నాయుడు, ఎంపీ శివప్రసాద్, జిల్లా అధ్యక్షుడు నాని, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.ఎం.రఫి, తంబళ్లపల్లె ఎంఎల్ఏ జి.శంకర్, టిడిపి మైనార్టి నాయకులు ఎస్.ఏ.మస్తాన్, రాష్ట్ర వక్స్ బోర్డు సభ్యురాలు పర్వీన్‌తాజ్, పఠాన్‌ఖాదర్‌ఖాన్, దాదు, నూర్ తదిరులు పాల్గొన్నారు.













