రాష్ట్రమంతటా శిల్పారామాలు : చంద్రబాబు
గోదావరి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశాలిచ్చారు. కలెక్టర్ల సదస్సులో ఆయన పర్యాటకంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆరకు కాఫీ ఆకులతో తయారు చేసిన ముఖ్యమంత్రి గ్రీన్‌టీకి ప్రాచుర్యం తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. శిల్పారామాల ఏర్పాటే కాదు, వాటి నిర్వహణ కూడా ఉత్తమంగా ఉండాలన్నారు. అమరావతిలో శిల్పారామాన్ని నెలకొల్పేందుకు 20 ఎకరాలు కేటాయించాలని ఆదేశాలిచ్చారు. 9 జిల్లాలో చేపట్టిన శిల్పారామ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా పరిష్కార వేదిక కాల్‌సెంటర్‌ను జిల్లా కలెక్టర్లు వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులొస్తే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తమ సమాచారాన్ని మీకు ఆర్టిజి ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తామన్నారు. ఈ సమాచారాన్ని మీరు ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితాలోస్తాయన్నారు. ఈ నెల ప్రజల్లో సంతృప్తిస్థాయి 5 శాతం పెంచాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.













