ఆయనను ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో సైకో పాలనకు ప్రజలు చరమగీతం పాడకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు రోడ్ షో సాగింది. విజయవాడ రాణిగారి తోటలో వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. జగన్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంటి యజమాని అనుమతి లేకుండానే ఇంటింటికీ స్టిక్కర్లు అతికించడం అనైతికమన్నారు. జగన్ సమాజానికి క్యాన్సర్ లాంటివాడు. జగన్ మీ బిడ్డ కాదు. క్యాన్సర్ గడ్డ. క్యాన్సర్ గడ్డను తొలగించుకోకపోతే శరీరమంతా వ్యాపిస్తుంది. మంచి పనిచేస్తే జనం ఓట్లు వేస్తారు. చెడ్డపని చేస్తే చిత్తుచిత్తుగా ఓడిస్తారు అని అన్నారు. ఐదేళ్లుగా ఏం మంచి పనిచేశావ్ జగన్? జగన్ రాష్ట్రానికి దరిద్రం. బయటి రాష్ట్రాల ప్రజలు ఏపీ పరిస్థితి చూసి జాలి పడుతున్నారు. జగన్ను ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు అన్నారు. జగన్ తన బాబాబు ని రోజుకో రకంగా చంపేస్తున్నారు. ఆర్థిక ఉగ్రవాదులైన ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం. రాజకీయాలకే అర్హతలేని వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని ప్రజాజీవితాన్ని తమాషా అనుకోవద్దు. బెదిరిస్తే తోకలు కట్ చేస్తా. రౌడీయిజాన్ని తుంగలో తొక్కేస్తాం. ఎక్కడ రౌడీలున్నా వారి గుండెల్లో టీడీపీ నిద్రపోతుంది. రౌతు కొద్దీ గుర్రంలా పోలీసుల వైఖరి ఉంది. ప్రశ్నిస్తే చాలు మహిళలపైనా దాడు చేస్తున్నారు అని చంద్రబాబు మండిపడ్డారు.













