వారు ఎన్ని మాట్లన్న ప్రజల కోసమే… వైకాపాకు భయపడి కాదు
గుంటూరు జిల్లాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార రోడ్‌షోలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్ కోసం మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలని అన్నారు. రాష్ట్ర పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, విశాఖ, విజయవాడ పర్యటనలో ఈ విషయం స్పష్టమైందని చెప్పారు. ప్రజలు ఇంకా చైతన్య వంతులు కావాల్సిన అవసరముందన్నారు. వైకాపా నేతల రౌడీయిజం తన వద్ద సాగదని, పేకాట మంత్రి, అవినీతి మంత్రికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చంద్రబాబు కోరారు. వారు ఎన్నిక మాట్లన్నా ప్రజల కోసమే భరిస్తున్నానని, వైకాపాకు భయపడి కాదని అన్నారు. రాజధాని అమరావతి ఆమోదయోగ్యమో, కాదో ఓటు ద్వారా చెప్పాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.













