ఎన్నికల్లో గెలిస్తే ఇంటికో స్మార్ట్ ఫోన్‌ను మహిళలకు ఇస్తాము : చంద్రబాబు
విజయనగరంలోని సాలూరులో సీఎం చంద్రబాబు రోడ్‌షో – అయిదేళ్లలో ఏపీకి ఎంతో చేశామో అందరికీ తెలుసు – అందుకు ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉంది – విభజన తర్వాత కట్టుబట్టలతో అమరావతికి వచ్చినా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాము – పెన్షన్లను 10 రెట్లు పెంచిన ఘనత టీడీపీదే – అలాగే ఆడబిడ్డలకు పసుపు – కుంకుమ ఇచ్చిన ఘనత కూడా టీడీపీదే – టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే – ఫైబర్ గ్రిడ్‌ను కూడా ఏపీకి తెచ్చాము – ఎన్నికల్లో గెలిస్తే ఇంటికో స్మార్ట్ ఫోన్‌ను మహిళలకు ఇస్తాము – రైతులు ఇబ్బంది పడొద్దు – 24,500 కోట్ల రుణమాఫీని చేశాము – రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని సైతం తీసుకొచ్చాము – కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ అమలు చేస్తాము – జగన్‌ను చూస్తే జైలుకు తీసుకెళ్తారనే భయం ప్రజల్లో ఉంది – కానీ నన్ను చూస్తే పెట్టుబడులు పెడతామని పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తారు – ఇంతకు ముందు ఐఏఎస్ ఆఫీసర్లు, పారిశ్రామిక వేత్తలు చాలా మంది జైలు పాలయ్యారు – అందుకే వైసీపీకి సహకరిస్తే తెలియకుండానే నేరాల్లో ఇరికించి జైలు పాలు చేస్తారు – వైసీపీ నేరాల చిట్టా, పనికి మాలిన పార్టీ.













