సీమలో కృష్ణాతరంగాలు-జనావళి సంబరాలు
మార్చి 15న చిత్తూరుకు నీరు
ఒకే రోజు 5 ప్రదేశాల్లో జలసిరికి హారతి
పలమనేరు, కుప్పం, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు
మదనపల్లికి రోజూ మంచినీరు
పోలవరం పనులు 76% పూర్తి
ప్రారంభానికి సిద్ధంగా 4 ప్రాజెక్టులు
ముఖ్యమంత్రి చంద్రబాబు
రాయలసీమకు కృష్ణాజలాలు దశాబ్దాలుగా కలగా మిగిలాయని, సీమ వాసుల కలలను తాము నిజం చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం-ప్రాధాన్యతా ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి 88వ సమీక్షను ప్రారంభిస్తూ పోలవరం ప్రాజెక్టును 66% పూర్తిచేసిన అధికారులను అభినందించారు. లక్ష్యం మేర పనుల పూర్తికి వేగం పెంచాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాల చేరికతో జిల్లా వాసులు సంతోషంగా ఉన్నారని, అనేక ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో చిత్తూరుకు మార్చి 15న నీరు తీసుకెళతామన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు, కుప్పం, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరుల్లో జలసిరికి హారతి ఒకే రోజు జలసిరికి హారతి ఇస్తామని, ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మదనపల్లికి ఇక రోజూ తాగునీరు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చెరువులన్నీ నింపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పుంగనూరు చెరువుకు మంగళవారం నీరు విడుదల చేస్తామని అధికారులు వివరించారు. అలాగే కుప్పం బ్రాంచి కెనాల్ కు రేపు నీరువిడుదల చేయాలని, పలమనేరు చిన్న చెరువు నింపాలన్నారు.
కెల్లర్ కంపెనీ నివేదిక ఆవిష్కరణ
పోలవరం ప్రాజెక్టుకు 2017 నుంచి కాఫర్ డ్యామ్ కోసం జెట్ గ్రౌటింగ్ చేస్తున్న కెల్లర్ కంపెనీ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. మనదేశంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు జెట్ గ్రౌటింగ్ టెక్నాలజీ వినియోగం ఇదే తొలిసారి అని ఆ కంపెనీ తన నివేదికలో పేర్కొంది. గ్లోబల్ స్ట్రెంత్-లోకల్ ఫోకస్ అనే నినాదంతో పనిచేస్తున్న కెల్లర్ ప్రపంచంలో అత్యుత్తమ టెక్నాలజీని పోలవరం ప్రాజెక్టులో వినియోగిస్తోంది.
నేలలో బలహీనమైన ఇసుక, బలహీనమైన రాతి పొరలు ఉంటే ప్రాజెక్టు నిర్మాణం మీద ఆ ప్రభావం పడకుండా కట్టడాన్ని పటిష్టంగా ఉంచడానికి జెట్ గ్రౌటింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రాజెక్టు నిర్మాణం లోపల భూమిలో 10 నుంచి 20 మీటర్ల వరకు డ్రిల్ రిగ్ ద్వారా ద్రవాన్ని పంపడం ఈ ప్రక్రియలో ముఖ్యభాగం.
పోలవరం ప్రాజెక్టు 66% పనుల పూర్తి
పూర్తిచేసిన తవ్వకం పనులు: 4.48 లక్షల క్యూబిక్ మీటర్లు
కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్: 1.73 సి.సి.మీ పనుల పూర్తి (23.61%)
మేనెలాఖరుకు పనుల పూర్తి
కాఫర్ డ్యాం డౌన్ స్ట్రీమ్ : 74 వేల సిసి. మీ (6.8 %) పనుల పూర్తి
ఏప్రిల్ నెలాఖరుకు పనుల పూర్తి.
లక్ష్యాల మేరకు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. పనులు సకాలంలో పూర్తికాకపోతే ఇబ్బందులు వస్తాయని అన్నారు. మడకశిర పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆయన కోరారు.
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాధాన్య ప్రాజెక్టులు
• 1.పులిచింతల
• 2.గుండ్లకమ్మ
• 3.మడకశిర బ్రాంచి కెనాల్
• 4. అడవిపల్లి రిజర్వాయర్, అడవిపల్లి లిఫ్టు
పురోగతిలో ఉన్న ప్రాధాన్య ప్రాజెక్టులు
• 1.పురోగతిలో వంశధార ప్రాజెక్టు (రెండో దశ)
• 2. వంశధార-నాగావళి అనుసంధానం
• 3. బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్-1
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతి-ప్రస్తుత స్థితి ( 11.2.19- 17.2.19 వరకు)
గత వారంలో పూర్తయిన ప్రాజెక్టు పనులు 65.91% (దాదాపు 66%)
ఈ వారం పూర్తయిన పనులు 0.46%
వారాంతానికి పూర్తయిన పనులు 65.91%
హెడ్ వర్క్స్ పనులు గత వారం 55.96%
ఈ వారం 0.70%
ఈ వారాంతానికి 56.24%
మెయిన్ డ్యామ్ ప్యాకేజీ 55.54%
ఈ వారం 0.70%
ఈ వారాంతానికి 56.24%
తవ్వకం పనులు
(స్పిల్వే, స్పిల్ ఛానెల్ అప్రోచ్ ఛానెల్ , పైలట్ ఛానెల్, లెఫ్ట్ ఫ్లాంక్)
గతం వారం: 81.90%
ఈ వారం 0.40%
వారాంతానికి పూర్తయి మొత్తం : 82.30%
కాంక్రీట్ (స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్. స్పిల్ ఛానెల్, క్రివైసిస్ ఫిల్లింగ్ (Crevices filling)
గతవారం 62.42%
ఈ వారం 1.39%
వారాంతానికి పూర్తయిన మొత్తం 63.81%
రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
వాటర్ బడ్జెటింగ్ ఒక మంచి కార్యక్రమమని, భూగర్భ జలమట్టాలపై అవగాహన పెంచడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జల చైతన్యంలో, రైతాంగానికి సాధికారత కల్పించడంలో, నైపుణ్యాభివృద్ధికి జలవనరుల శాఖ చేసిన కృషికి గ్లోబల్ ప్లాటినమ్ అవార్డు లభించడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రౌండ్ వాటర్ రీచార్జిలో అనంతపురము జిల్లాకు మొదటి స్థానం, నదుల పునరుజ్జీవనంలో కర్నూలు మొదటి స్థానం, వాటర్ రీచార్జిలో విశాఖ రెండో స్థానం, రివైవల్ ఆఫ్ వాటర్ విభాగంలో కడప జిల్లా మొదటి స్థానం లభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ జలవనరుల శాఖ కృషికి ఇది మంచి గుర్తింపు అని, ఈ అవార్డులు మరింత బాధ్యతను పెంచుతున్నాయని అన్నారు.
కాగా ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ ఇండియా ప్రకటించిన ఈ అవార్డును ఢిల్లీలో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ తరపున జాయింట్ డైరెక్టర్ వరప్రసాదరావు, భూగర్భజలవనరుల శాఖ జాయింట్ డైరెక్టర్ నల్లూరి శ్రీనివాస్ లు స్వీకరించారు. ఢిల్లీలో పెట్రో-కోల్ కాంగ్రెస్ అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును అందజేశారు. ఈ సదస్సులో మనదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, గెయిల్, ఐఓసీ, హెచ్.పి.సి.ఎల్. ఎన్.టి.పి.సి, పి.సి.ఎల్ పాల్గొన్నాయి. మానవ ప్రగతికి మూలమైన జలవనరుల రంగంలో 4 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వ కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. రైతాంగానికి నీరు-ప్రగతి కార్యక్రమం కింద వాటర్ బడ్జెటింగ్లో జలవనరుల శాఖ అవగాహన కలిగించింది. హైడ్రాలజీ ప్రాజెక్టు కింద నీరు-చెట్టు కార్యక్రమంలో రైతాంగానికి నైపుణ్య శిక్షణనిచ్చింది. జిల్లా, మండల స్థాయిలో నీరు-ప్రగతిపై అవగాహనకు శ్వేతపత్రాల విడుదల చేసిన జలవనరుల శాఖ కృషిని ఎనర్జీ ఎన్విరాన్మొట్ ఫౌండేషన్ ఇండియా గుర్తించి పురస్కారం ప్రకటించింది. జలవనరుల శాఖ మేధావులు, నిపుణులు, కళాశాల అధ్యాపకులు, కళాశాల విద్యార్ధులతో సదస్సులు నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకున్నది. రైతులు, సాగునీటి సంఘాలు, మహిళా, యువజన సంఘాలతో జలవనరుల ఆవశ్యకతపై అవగాహన సదస్సులు నిర్వహించింది.
ఓ ఏడాది 90 రోజులు, మరో ఏడాది 149 రోజులు జలసంరక్షణ కార్యక్రమంపై అవగాహన ప్రచారోద్యమం నిర్వహించింది. అలాగే ముప్ఫయ్ ఆరు వేల సభ్యులున్న నీటివినియోగదారుల సంఘాలకు పునరుద్ధరించింది. గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంగా జలహారతి కార్యక్రమాలు నిర్వహించి ప్రకృతితో మనిషి అనుసంధానతను, జలవనరుల ఆవశ్యకతపై ఉద్యమ స్ఫూర్తితో అవగాహన కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ట్యాంక్ మేనేజిమెంట్ ప్రోగ్రాం (AIAATP) లో భాగంగా అన్నదాతలకు చెరువులు, చిన్న జలవనరులు, భూగర్భ జలమట్టాల నిర్వహణలో జలవనరుల శాఖ శిక్షణనిచ్చింది. పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టుల సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.













