Chandrababu: ఎప్పటికప్పుడు డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షించాలి : చంద్రబాబు ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అధికారులను ఆదేశించారు. నిత్యం నమోదవుతున్న ఉష్ణోగ్రతల సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ (Mobile Alerts) ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ మేరకు వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, వైద్యారోగ్య శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలతో తీసుకోవడం ద్వారా వడదెబ్బ మరణాలు తగ్గించాలన్నారు. తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్న ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు (Buttermilk centers) , చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం (Water bell method) అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు డ్రోన్ల (Drones) తో పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం సూచించారు.













