వంశీ లేఖపై స్పందించిన చంద్రబాబు
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బుజ్జగించి, సమస్యను పరిష్కరించే బాధ్యతను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు అప్పగించారు. వంశీ తనకు రాసిన రెండో లేఖపై చంద్రబాబు స్పందించారు. పార్టీ పట్ల వంశీకున్న అంకితభావం, పోరాటాలు మరిచిపోలేనివని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంపై పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. తదుపరి కార్యాచరణకు కేశినేని నాని, కొనకళ్ల సమన్వయంగా ఉంటారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి వారితో చర్చించి కార్యాచరణ రూపొందించుకోవాలని కోరారు.













