కొత్త విధానం ఏర్పాటు చేసుకొని… మరీ దోపిడీ : చంద్రబాబు
గత ఐదేళ్లలో వైసీపీ నేతలు సహజ వనరులను దోపిడీ చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో సహజవనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అడవులను కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని అన్నారు. వైసీపీ హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకొని మరీ దోపిడీ చేశారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలను పాల్పడ్డారు. ఇళ్లు నిర్మాణం పేరుతో దందా చేశారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్రపన్నారు అని మండిపడ్డారు.













