వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్…82 రోజుల్లో పతనం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన రా కదలిరా సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, 82 రోజుల్లో పతనం తప్పదన్నారు. రా కదలి రా అని పిలుపిస్తే వెంకటగిరి గర్జించింది. జగన్ రాజకీయ వ్యాపారి. మనందరినీ పెట్టుబడిగా పెట్టి రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. వైసీసీలో ఉంటూ జగన్ పాలన బాగోలేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ప్రజాహితం కోసం మాట్లాడితే ఆయన్ను దూరం పెట్టేశారు. సీనియర్లను కూడా లెక్కచేయని అహంకారం జగన్‌ది. ఈ సీఎం వెయ్యి తప్పులు చేశారు. ఇంకా భరిస్తారా? అని ప్రశ్నించారు. జీతం కోసం అడిగితే ఉద్యోగులు జైలుకు వెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక వెంకటగిరి తలరాత మారిందా? 25 ఏళ్ల క్రితం యువతకు ఐటీ అనే ఆయుధమిచ్చా, అదే ఇప్పుడు వజ్రాయుధమైంది. టీడీపీ హయాంలో తిరుపతిని మొబైల్ హబ్‌గా తీర్చిదిద్దాం. ఓటు అనే ఆయుధాన్ని ప్రజలు ఉపయోగించాలి అని కోరారు.













