ముఖ్యమంత్రి బాధ్యత లేదా? : చంద్రబాబు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నారని, ముఖ్యమంత్రి గడపదాటి బయటకు రారా? అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా రోగులకు ధైర్యం చెప్పి భరోసా నింపేందుకు ఆస్పత్రులను సందర్శించనున్న టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఆస్పత్రులను ఎందుకు సందర్శించడం లేదని నిలదీశారు. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా? అని అన్నారు. నిరుపేద రోగుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేట్ ఆస్పత్రులపై నియంత్రణ చర్యలు లేవని అన్నారు. ప్రభుత్వ ఆస్పుత్రల్లో మందులు లేవని, 45 ఏళ్ల నిండిన వారికి ఇంకా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వలేదని ఆరోపించారు. ఏడాది నుంచి కరోనా విలయతాండవం చేస్తున్నా ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చడానికి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు.