ప్రత్యేక హోదా సెంటిమెంట్ తోనే ఎన్డీఏకి దూరం.. మోదీ పాలన బేష్ : చంద్రబాబు
ఎన్డీఏ అభివృద్ధి విధానాలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ వల్లే ఎన్డీఏ నుంచి బయటికొచ్చామని స్పష్టం చేశారు. టైమ్ ఆఫ్ ట్రాన్ష్ఫర్మేషన్: ద నీడ్ టు కీప్ ఫైటింగ్ అంశంపై జరిగిన సదస్సులో చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ అభివృద్ధి విధానాలతో ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. మోదీ ప్రపంచ వ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారు. మోదీ వల్లే ఇవాళ ప్రపంచమంతా భారత్‌ను గుర్తిస్తోంది. పీపీపీ` పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్షిప్ అన్నది కొత్త విధానం. టెక్నాలజీతో పేదరికాన్ని రూపుమాపవచ్చు. ఫిన్‌టెక్ దేశంలో కొత్త విప్లవాన్ని తెచ్చింది. డిజిటల్ టెక్నాలజీ, డెమోగ్రాఫిక్ డివిడెండ్ దేశాన్ని నడిపిస్తాయి. మోదీ తెస్తున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ప్రధాని విధానాలను మెరుగుపెడితే 2050 నాటికి భారత్‌దే అగ్రస్థానం. రూ.500 కంటే పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని ప్రతిపాదిస్తున్నా అని చంద్రబాబు తెలిపారు.













