చంద్రబాబు పర్యటన.. పెన్నా టు వంశధార
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగస్టు 1 నుంచి పది రోజుల పాటు పెన్నా టు వంశధార పేరుతో ప్రాజెక్టులను సందర్శిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతి ఎన్టీఆర్ భవన్లో అచ్చెన్న నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో కొన్ని ప్రాజెక్టులను ప్రీక్లోజర్ చేసిన విధానాన్ని వివరిస్తామన్నారు. వ్యవసాయ, సాగునీటి రంగాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు చేపట్టిన పెన్నా టు వంశధార కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా కాకుండా ప్రజా అవగాహన కార్యక్రమంగా చూడాలని కోరారు. జగన్ సహా మంత్రులు, వైసీపీ నేతలు దోపిడీనే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు.













