తొలి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు.. వింటుంటే బాధగా
దేశంలో భాషా ప్రతిపాదికన ఏర్పాటై తొలి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకమరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్న మనం, ఇప్పుడు తెలుగును పరిరక్షించుకునేందుకు ఇంకా పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యమం కనుమరుగవుతుందని వింటుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు మనందరం పునరంకితం అవ్వాలన్నారు.
తెలుగు అకాడమీని తెలుగు, సంస్కృత అకాడమీగా పేరు మార్చాక రూ.63 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయన్న వార్త తప్ప.. ఆ సంస్థ తెలుగు భాష కోసం ఏం చేసిందనేది ఎవరికీ తెలియదు. తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థ కూడా నిరుపయోగంగా మారిందన్నారు. ఒక జాతి పురోగమన మార్గాన్ని ముందుండి నడిపించేది తల్లి భాష. తెలుగును వాడక భాషగా సమాన్యులకు చేరువ చేసేందుకు ఆనాడు గిడుగు పెద్ద పోరాటమే చేశారు. టీడీపీ హయాంలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి 2018లో ఏపీ తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశాం అని అన్నారు.













