ఏ సమస్య వచ్చిన 1100 కు ఫోన్ చేయండి
ప్రజలు ఏ సమస్య వచ్చినా 1100 నెంబర్‌కు ఫోన్ చేసి సలహాలు పొందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని బడేవారిపాలేం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధికి పట్టుగొమ్మలుగా ఉండాలన్నారు. అలాగే అధికారులు సక్రమంగా పనిచేయాలని అన్నారు. పశువుల సంరక్షణకు గోకులాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. కాగ బడేవారిపాలెంలో ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.













