గంగమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో వెలసిన గంగమ్మ అమ్మవారి జాతర వైభవంగా సాగుతోంది. అర్చకులు అమ్మవారి విగ్రహాన్ని అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. వేలాది భక్తులు జాతరలో పాల్గొన్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రఖ్యాతిగాంచిన జాతరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి గంగమ్మ అమ్మవారికి ప్రత్కేక పూజలు చేశారు. అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పాలక మండలి సభ్యులు సీఎం దంపతులను శాలువాలతో సన్మానించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్త చేకూరి తదితరులు హాజరయ్యారు.













