ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేసింది
ఏపీ భవన్ నుంచి జంతర్ మంతర్ వరకు చంద్రబాబు పాదయాత్రలో మీడియాతో మాట్లాడిన అంశాలు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేసింది
- కేంద్రం ప్రతి అంశాన్ని తప్పుదోవ పట్టిస్తుంది
- కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది
- కోట్లాది ప్రజల మనోభావాలతో కేంద్రం ఆడుకుంటోంది
- ఇవాళ రాష్ట్రం మొత్తం ఢిల్లీ వీధుల్లో నడుస్తోంది..సమైక్యంగా అందరూ మాకు మద్దతిస్తున్నారు
- హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టు సంఘాలతో కలిసి రాష్ట్రపతి వద్దకు వెళ్తున్నాం. వారందరితో కలిసి ఉద్యమిస్తాం… అందరం వెళ్తున్నాం
- కులాలకు, మతాలకు అతీతంగా పోరాడుతున్నాం
- ప్రధాని మోదీ గవర్నమెంట్ మమ్మల్ని నమ్మించి మోసం చేసింది.
- హైదరాబాద్ లో 60 యేళ్లు కష్టపడి అభివృద్ధి చేసి కట్టుబట్టలతో ఏపీకి వచ్చాం
- వారితో సమానంగా రావడానికి 20 నుండి 30 యేళ్ల సమయం పడుతుంది..అది కూడా వస్తామో లేదో కూడా చెప్పలేం.
- కష్టాల్లో మనం ఉంటే మన జీవితాలతో ఆడుకుంటున్నారు
- మా పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గం.. దారుణం
- మా జీవితాలతో దయచేసి ఆడుకోవద్దని, మా మనోభావాలు దెబ్బతీయవద్దని హెచ్చరిస్తున్నాం.అదే జరిగితే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.
- మా భావితరాలకు భరోసా ఇవ్వమని కోరితే వారి భవిష్యత్ తో ఆడుకుంటున్నారు
- మా జీవితాలతో ఆడుకోవద్దని ఇవాళ 5 కోట్ల ప్రజల తరపున హెచ్చరిస్తున్నాం.
- ఇది త్యాగం..ఢిల్లీ నడి వీధుల్లో మాకు నడవాల్సిన అవసరం లేదు. మా హక్కుల కోసం నడిచాం. దేశ రాజధాని కాబట్టే ఇవాళ నడిచాం.ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
- మేమేం చేయలేం అనుకుంటే పొరపాటు .. ఏపీ మీ గుండెలో నిద్రపోతుంది..
- ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయాన్ని దేశమంతా చూస్తోంది .. న్యాయంగా మా హక్కులను సాధించుకుంటాం. అంత వరకు మా పోరాటం ఆగదు.
- రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెబుతారు
- ప్రజాక్షేత్రంలో అంతిమ తీర్పు వస్తుంది
- ప్రజాకోర్టుకు వెళ్లి మీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడిస్తాం
- మోదీ, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ఒకటే.. మోదీ అభీష్టం..జగన్ ఆచరణ
- కేసుల కోసం, స్వ ప్రయోజనాల కోసం జగన్ మోహన్ రెడ్డి మోదీకి ఊడిగం చేస్తున్నారు
- మోదీ కాళ్లను జగన్ కడిగినా మాకేమీ అభ్యంతరం లేదు
- ప్రజాస్వామ్యంలో మేం ఏమేం చేయాలో చేస్తున్నాం. చేయాలి కూడా. తొలుత పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టాం..వినలేదు
- రాష్ట్ర వ్యాప్తంగా ధర్మపోరాట దీక్షలు చేశాం..వినలేదు
- ఢిల్లీలోనూ ధర్మపోరాటం చేశాం. అయినా వినలేదు
- నిన్న మహామహులు ఒకే వేదిక పైకి వచ్చి ఏపీ తరపున స్వరం వినిపించారు.. అయినా కేంద్ర ప్రభుత్వం వినలేదు
- ఏపీ భవన్ నుంచి జంతర్ మంతర్ వరకు పాదయాత్ర చేస్తున్నాం.. అయినా వినలేదు
- రాష్ట్రపతి కి చెబుతున్నాం … వినలేదు
- ధర్నాలు, నిరసనలు చేశాం… వినలేదు
- మేం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు ప్రజా ప్రయోజనాల కోసం పోరుడుతన్నాం..మా ఈ పోరాటం ప్రజా పోరాటం
- అంతిమంగా ప్రజాకోర్టుకు వెళదాం…అక్కడే మిమ్మల్ని శిక్షిస్తాం..ప్రజలే మిమ్మల్ని శిక్షిస్తారు.
- ఈరోజు మేం చేసే పోరాటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం.
- నమ్మించి మోసం చేసిన పార్టీలకు ప్రజాక్షేత్రంలోనే తగిన బుద్ధి చెప్పాలి.
- పోలవరం విషయంలో టెక్నికల్ కమిటీ యాక్సెప్ట్ చేసింది. ఫైనాన్స్ కమిటీ యాక్సెప్ట్ చేయాలి. నిధులు విడుదల చేయాలి. ముందు అది చేయాలని డిమాండ్ చేస్తున్నాం
- కాలయాపన చేసి ఏదో విధంగా మభ్యపెట్టాలని చూడటం సరికాదు
- రాఫెల్ పెద్ద కుంభకోణం
- దేశ భద్రతను ప్రధాని ఫణంగా పెడుతున్నారు
- రాఫెల్ విషయంలో నిజాన్ని ఎవరూ దాచిపెట్టలేరు
- సుప్రీంకోర్టు కు రాంగ్ అఫిడవిట్ సమర్పించారు
- ఇవాళ జగన్ బీజేపీతో కలిశారు..కలిసి పని చేస్తున్నారు.. ప్రజలు చీకొట్టే స్థితికి వచ్చారు.
- నరేంద్ర మోదీ లాగా అవినీతి పరులను రక్షించం… అవినీతి పరులను థర్డ్ ఫ్రంట్ శిక్షిస్తుంది..













