NITI Aayog: నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు. పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను ప్రశంసిస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీయే ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాలను తన ప్రజంటేషన్లో ప్రస్తావించారు. చంద్రబాబు ప్రజంటేషన్‌లోని వివిధ అంశాలు వికసిత్ భారత్‌కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోదీ (Prime Minister Modi) పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. చంద్రబాబు ప్రజంటేషన్‌కు సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రజంటేషన్లో చంద్రబాబు వివరించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు వెల్లడిరచారు. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను తాము ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామనే విషయాన్ని తన ప్రజంటేషన్లో వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్లు చంద్రబాబు వెల్లడిరచారు. విశాఖ (Visakhapatnam)కు గ్లోబల్ హంగులు అద్దేలా నాలుగు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. విశాఖ మోడల్‌ను అమరావతి, తిరుపతి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని కోరారు. డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా గూగుల్ ఎఐ వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్‌బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు స్పష్టం చేశారు.













