సీఎం జగన్ కు చంద్రబాబు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రజలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బర్త్డే విషెస్ తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించిన ఆయన వైఎస్ జగన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.













