ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయదశమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లో తెలుగువారికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అమ్మవార్ల ఆశీస్సులు కోరుకుంటున్నానన్నారు. పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం అడ్డుకోవాలని దుష్టశక్తులు కుతంత్రాలు పన్నుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కూడా రాక్షసత్వమేనని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని ఆకాంక్షించారు. అభివృద్ధి నిరోధక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ప్రజలను హెచ్చరించారు. చెడుపై మంచి గెలుపు… విజయాలకు మలుపని చంద్రబాబు వ్యాఖ్యానించారు.













